- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇదే తొలిసారి.. కన్నీళ్లు వస్తున్నాయి: స్వరూపానందేంద్ర స్వామి
దిశ, డైనమిక్ బ్యూరో: చందనోత్సవం సందర్భంగా సింహాచలం అప్పన్నస్వామి నిజరూపాన్ని దర్శించుకునేందుకు దర్శనానికి భక్తులు పోటెత్తారు. అప్పన్న నిజరూప దర్శనం కోసం ఆలయం వద్ద భక్తులు బారులు తీరారు. వృద్ధులు దగ్గర నుంచి చిన్నారుల వరకు స్వామి వారి దర్శనం కోసం తరలివచ్చారు.
అయితే క్యూ లైన్లలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆలయసిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్‌లో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు కొండపైకి బస్సుల కొరతతో చందనోత్సవ భక్తులు కొండ కింద తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది భక్తులు నడుచుకుంటూ స్వామి వారి దర్శనం కోసం వెళ్తున్నారు. మరోవైపు వీఐపీ వాహనాలు భారీగా కొండపైకి చేరుకున్నాయి. దీంతో సింహగిరి ఘాట్‌రోడ్డులో వాహన రాకపోకలు భారీగా స్తంభించాయి. బస్సులు నిలిచిపోవడంతో చాలా మంది భక్తులు కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో దేవస్థానం సిబ్బంది, పోలీసులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏర్పాట్లపై స్వరూపానంద ఆగ్రహం
సింహాచలం అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లపై విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏర్పాట్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. క్యూలైన్లలో భక్తుల పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గర్భాలయంలో ఆచారాలనూ మంటగలిపారని మండిపడ్డారు. ఆలయంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ రోజు స్వామి వారి దర్శనానికి ఎందుకు వచ్చానా అని బాధ కలుగుతుందన్నారు. పేదల దేవుడి దగ్గర గందరగోళం సృష్టించారని, సామాన్య భక్తులను దేవుడికి దూరం చేసేలా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసులు భారీగా మోహరించారే తప్ప ఎలాంటి ఏర్పాట్లు లేవని మండిపడ్డారు.
తన జీవితంలో తొలిసారి ఇలాంటి చందనోత్సవానికి హాజరయ్యానని ఇలాంటి దౌర్భాగ్యం ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు సింహాచలం ఆలయానికి ఇప్పటికీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేకపోవడం బాధాకరమన్నారు. ఇన్‌చార్జి ఈవోతో ఉత్సవాలు జరిపించడం సరికాదన్నారు. భక్తులను దర్శించుకుంటే భగవంతుడిని దర్శించుకున్నట్లేనని తాను భావిస్తానని, అలాంటిది ఈ రోజు భక్తుల అవస్థలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని స్వరూపానంద స్వామి ఆవేదన వ్యక్తం చేశారు.