- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎవరికీ పట్టని..ఎర్రమట్టిదిబ్బలు! యథేచ్చగా విధ్వంసం
దిశ ప్రతినిధి, విశాఖపట్నం:వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అరుదైన వారసత్వ సంపద ఎర్రమట్టి దిబ్బలపై ప్రభుత్వాలకు ప్రభుత్వ పెద్దలకు సరైన అవగాహన లేకపోవడం శాపంగా మారింది. దేశ విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ ఎన్నో దశాబ్దాలుగా చలనచిత్ర షూటింగ్‌లకు కేరాఫ్ అడ్రస్ అయిన విశాఖ భీమిలి బీచ్ రోడ్‌లోని ఎర్రమట్టి దిబ్బలను ఇప్పటివరకు ఏ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. అదే ఇప్పుడు అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన ఎర్రమట్టి దిబ్బలకు శాపంగా మారింది. విధ్వంసానికి హేతువు అయింది.
సర్వే ఎందుకు చేయరు?
ఎర్రమట్టి దెబ్బల ప్రాంతం ఎంత విస్తీర్ణంలో ఉన్నదన్న దానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అసలు వాస్తవంగా ఎర్రమట్టి దెబ్బలు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో సర్వే జరిపి సరిహద్దులు నిర్ణయించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఏ ప్రభుత్వం కూడా దాని మీద సరిగా దృష్టి పెట్టలేదు. దీంతో ఎర్రమట్టి దిబ్బల్లో పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపి తాము తవ్వకాలు చేస్తున్నది నిజమైన ఎర్రమట్టి దెబ్బలలో కాదని నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాదిస్తూ వస్తున్నారు. పర్యావరణానికి ఎంతో మేలు చేసే ఎర్రమట్టిదిబ్బలు ఏ ప్రాంతంలో తొలగించినా దానివల్ల నష్టమే ఉంటుందని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భీమిలి బిల్డింగ్ సొసైటీ భూములను ఏం చేస్తారు ?
ఎర్రమట్టి దిబ్బల ప్రాంతంలోనే 1980 రెండవ సంవత్సరంలో రిటైర్డ్ అధికారులతో కూడిన భీమిలి బిల్డింగ్ సొసైటీకి 373 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఎర్రమట్టి దిబ్బల ప్రాంతంలో ఈ భూములు ఉండటంతో అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఆ తర్వాత జియోలాజికల్ సర్వే చేసి బిల్డింగ్స్ సొసైటీ ఇచ్చిన భూముల్లో 91.50 ఎకరాలను జియో హెరిటేజ్‌గా గుర్తించి జీఓ 99 తీసుకువచ్చి ఆ భూములను వెనక్కి తీసుకున్నారు. ఈ భూమితో పాటు రహదారులకు పోను బిల్డింగ్ సొసైటీకి 280 ఎకరాల భూమి మిగిలింది. ఇప్పుడు ఆ భూముల్లో తాము తవ్వకాలు జరుపుతున్నామని ఎర్రమట్టి దిబ్బలతో తమకు సంబంధం లేదని సొసైటీ నేతలు వాదిస్తున్నారు.
ప్రత్యామ్నాయ భూములు కేటాయించలేరా?
ఎర్రమట్టి దిబ్బలకు అంతర్జాతీయ ఖ్యాతి ఉన్నప్పుడు గతంలో భీమినిపట్నం కోపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి ఇచ్చిన భూ కేటాయింపులను రద్దు చేసి ప్రత్యామ్నాయంగా మరోచోట భూములు ఇవ్వాలని పర్యావరణవేత్తలు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. వేల సంవత్సరాల నాటి బుద్ధిష్ట్ హెరిటేజ్ స్థలాలు పక్కనే ఉన్నందున ఈ రెండింటిని కలిపి ఒక అంతర్జాతీయ పర్యాటక కారిడార్ ఏర్పాటు చేయవచ్చని ప్రముఖ పర్యావరణ వేత్త, ఫోరం ఫర్ బెటర్ విశాఖ కన్వీనర్ ఈఏఎస్ శర్మ ప్రభుత్వానికి సూచించారు. భీమిలి బిల్డింగ్ సొసైటీ స్థలాలతో పాటు వైయస్సార్ ప్రభుత్వ హయాంలో ఎర్రమట్టిదిబ్బలు ప్రాంతంలో వీఎంఆర్డీఏ ద్వారా వేసిన లేఔట్ల అనుమతులను కూడా రద్దు చేయాలనే డిమాండ్ ఊపందుకుంది.