- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News:వాహనాలకు గ్రీన్ టాక్స్ తగ్గించేందుకు కృషి చేస్తా:టీడీపీ ఎమ్మెల్యే
దిశ ప్రతినిధి, విశాఖపట్నం:భారీ వాహనాలకు గుదిబండగా మారిన గ్రీన్ టాక్స్ విషయమై ముఖ్యమంత్రితో మాట్లాడి తగ్గించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. కూర్మన్నపాలెంలో విశాఖపట్నం బల్క్ బిటుమేన్ అండ్ ఎల్‌ఎస్‌హెచ్‌ఎస్ ట్యాంక్ ట్రక్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పల్లాకు ఆత్మీయ సత్కారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం తాను గెలిచిన నెలరోజుల్లోనే అగనంపూడి టోల్ ప్లాజాను ఎత్తి వేయించానని చెప్పారు.
ట్రాన్స్ పోర్ట్ వ్యాపారం అనేక రాష్ట్రాలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో యజమానులకు ఇబ్బందులు కలిగేలా ఎటువంటి నిర్ణయాలు ఉండవని చెప్పారు. గాజువాకలో ట్రక్ టెర్మినల్ ప్రతిపాదన అంశమై రవాణా మంత్రి, ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపుతామని అన్నారు. తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బొండా జగన్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పుచ్చా విజయ్ కుమార్, అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్ కృష్ణమూర్తి, ఉపాధ్యక్షుడు ఆర్ తులసీదాస్, ప్రధాన కార్యదర్శి రాజేష్ లాల్, గౌరవ అధ్యక్షుడు పి సత్యనారాయణ,జాయింట్ సెక్రటరీ ఎస్.కె అహ్మద్, సహాయ కోశాధికారి డి దేవన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.