- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఉత్తరాంధ్ర మీద బాబు సవతి తల్లి ప్రేమ’..వైసీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
దిశ ప్రతినిధి, విశాఖపట్నం:ముఖ్యమంత్రిగా 4వ సారి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు అన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉత్తరాంద్ర మీద ఎంతో అభిమానం ఉన్నట్లు మళ్లీ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు అని మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో ఎటువంటి అభివృద్ధి పనులు చేస్తారో చెప్పకుండా గత వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పై, జగన్ మీద విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. విశాఖ విజేఎఫ్ ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భోగాపురం విమానాశ్రయం దానికి అవసరమైన అన్ని అనుమతులు వైకాపా ప్రభుత్వం జగన్ హయాంలో తీసుకువస్తే అన్నీ తామే చేసేము అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు.
భోగాపురం కోసం అంతా మేం చేశాం..
భోగాపురం విమానాశ్రయం కోసం 2019 నాటికి చంద్రబాబు హయాంలో టీడీపీ ప్రభుత్వం 2200 ఎకరాలకి 377 ఎకరాలు భూములు మాత్రమే రైతుల నుంచి ఆధీనంలోకి తీసుకుందని, మిగతావి రైతుల ఆధీనంలో ఉన్నాయని, 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులతో మాట్లాడి విమానాశ్రయం నిర్మాణం వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చేస్తుందని, ఉపాధి అవకాశాలు కలుగుతాయని నచ్చచెప్పి ఒప్పించి రైతులకు ఇవ్వవలసిన నష్టపరిహారం రెండింతలు ఎక్కువ చెల్లించి విమానాశ్రయానికి అవసరమైన భూములు సేకరించి వైకాపా ప్రభుత్వం న్యాయ పరమైన వివాదాలు పరిష్కరించి, విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు తీసుకువచ్చి జిఎంఆర్ సంస్థకు నిర్మాణం చేయడానికి అప్పగిస్తే అన్నీ తామే చేసేము అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు చిత్రీకరిస్తున్నారని విమర్శించారు.
కేంద్ర సంస్థల నిరభ్యంతర పత్రాలను తీసుకుని, సుమారు 350 వరకు యంత్రాలు తీసుకెళ్లి పనులు చేయించడం జరిగిందని, విమానాశ్రయ పనులు జరుగుతుంటే అవి జరగకుండా జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్ లో కూడా చంద్రబాబు కేసులు వేయించారని విమర్శించారు. వాటిన్నింటిని అధిగమించి మేము పనులు ప్రారంభిస్తే నిన్న వచ్చి తానే చేసినట్టు చంద్రబాబు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 1994 లో చంద్రబాబు మొదటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు పది ఏళ్ళ వయసు అప్పటి నుంచి విశాఖను ఆర్థిక రాజధాని చేస్తామని చెబుతున్నారు. ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత 4 వ సారి ముఖ్యమంత్రి అయినా కూడా అదే మాట చెబుతున్నారని విమర్శించారు.చంద్రబాబు మంచి మార్కెటింగ్ పర్సన్ ఏది జరగకుండానే అన్ని జరిగినట్టుగా రాష్ట్ర ప్రజల సింపతి కోసం తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని అమర్నాథ్ అన్నారు. బీపీసీఎల్ విషయంలో కూడా అదే పాట పాడారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా బిపిసిఎల్ పరిశ్రమ చర్చల దశలో ఉండగా, వైసీపీ అధినేత జగన్ అది కంఫర్మ్ అయితేనే బయటకు చెప్పామన్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం నైతికత ఉన్న ప్రభుత్వం కాబట్టి ఈ విషయాన్ని బయటకు వెల్లడించలేదని పేర్కొన్నారు.
తల్లికి వందనంలో యూ టర్న్..
స్కూల్ పిల్లల తల్లికి వందనం విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్నారని, ప్రస్తుతం ఒక కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే పథకం అమలు చేస్తామని చెబుతున్నారని, కుటుంబంలో ఎంతమంది స్కూల్ పిల్లలు ఉన్న ఒక్కొక్కరికి 18,000 రూపాయల చొప్పున ఇస్తామని ఎన్నికల వాగ్దానంలో చెప్పి, ఇప్పుడు ఒకరికి ఇస్తామనడం తల్లులకు వందనం పేరున చేస్తున్న పెద్ద మోసమన్నారు. ఈ పథకం అమల్లో మాకు కొన్ని అనుమానాలున్నాయని పేర్కొన్నారు.ఉచిత ఇసుక అన్నారని, లోడు తీసుకెళ్లడానికి 1394 ధర వసూలు చేస్తూ ప్రజలను మోసం చేయడం ఎంతవరకు న్యాయమన్నారు. విద్యుత్ రేట్లు ముందు పెంచమన్నారు. ఆ తర్వాత ఉచిత విద్యుత్ అన్నారు. ఇప్పుడు అడిగితే నాణ్యమైన విద్యుత్ కోసం రేట్లు పెంచాలని సీఎం చంద్రబాబు చెబుతున్నారని ఇది ప్రజలకు చేస్తున్న మోసం, అబద్ధాలు కాదా అని ఆయన ప్రశ్నించారు.