- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సీఎం జగన్‌పై రాళ్ల దాడి..సెన్సేషనల్ కామెంట్స్ చేసిన వర్ల రామయ్య
దిశ,వెబ్‌డెస్క్: సీఎం జగన్ గులకరాయి డ్రామా రక్తికట్టలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గజమాలకు ఉన్న పుల్ల గుచ్చుకోగానే ఆయన చేయి అక్కడికి వెళ్లిందన్నారు. అక్కడి నుంచి నాటకం ప్రారంభమైందని.. టవల్‌తో గాయాన్ని అడ్డుకున్నారని చెప్పుకొచ్చారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జగన్‌కు అందించిన వైద్యం కూడా డ్రామాలో భాగమే అని అన్నారు. గతంలో చిన్న కోడి కత్తితో గుచ్చితే ఐదు సంవత్సరాలు ఒక అమాయకుడిని జైల్లో పెట్టించిన ఘనత సీఎం జగన్ అని విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే విజయవాడ సీపీ రాణా గురించి మాట్లాడుతూ..అతను ఒక అర్భకుడు, అమాయకుడిని బలి చేయబోతున్నారని మండిపడ్డారు.
జగన్ అధికార దాహానికి మరో అమాయకుడు జైలు పాలు కాబోతున్నారని ఫైర్ అయ్యారు. ఒక అర్భకుడిని బలిచేసి చెడ్డపేరు తెచ్చుకోవద్దని సీపీ రాణాకు తెలియజేస్తున్నాను అని హితవు పలికారు. చిట్ట చీకటిలో వచ్చిన రాయిని కెమెరాలో ఎలా బంధించగలరు? వైసీపీ ట్రేడ్ మార్క్ గొడ్డలి అయితే గులకరాయి ఎందుకు వాడారు? అందుకే కథ అడ్డం తిరిగింది’’ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. జగన్ ఆడిన డ్రామాలో భాగస్వాములు కావద్దని సూచనలు చేశారు. ప్రజలు జగన్ ఆడినది ముమ్మాటికి డ్రామానే అని అర్థం చేసుకున్నారన్నారు. దీన్ని రచించిన రచయితకు నంది అవార్డు ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు. జగన్ ఆడిన ఈ గులకరాయి డ్రామాలో అద్భుతంగా నటించిన జగన్‌కు ‘ఆస్కార్’ అవార్డు ఇవ్వాలి అంటూ వర్ల రామయ్య సెటైర్ విసిరారు.