- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీ నేత మద్యం షాపుపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఓ మద్యం షాపుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. సత్యసాయి జిల్లా, ధర్మవరంలో ఇటీవలే ఎలాట్ అయిన ఏడో నెంబర్ షాపులో దూరిన దుండగులు షాపులోని మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. మద్యం దుకాణం ఈ రోజు (బుధవారం) ప్రారంభం కానుండగా.. రాత్రికి రాత్రి దాడి చేసిన ఆగంతకులు లోపలి బాటిళ్లన్నింటినీ ధ్వంసం చేశారు. మొత్తం రూ.3 లక్షల విలువైన సరుకు ధ్వంసమైనట్లు యజమాని పేర్కొన్నారు. అయితే ఈ మద్యం దుకాణం వైసీపీ నేత బాలిరెడ్డిది కావడంతో దాడిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. తనకు మద్యం షాపు దక్కడంతో ఓర్వలేక కూటమి ప్రభుత్వానికి చెందిన టీడీపీ, బీజేపీ వాళ్లే ఈ దాడి చేయించారని బాలిరెడ్డి ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించి లాటరీ పద్ధతిలో కేటాయింపులు జరిపిన విషయం తెలిసిందే. 16వ తేదీ నుంచి నూతన మద్యం విధానం అమలు కానున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి షాపులు దక్కించుకున్న వ్యక్తులు మద్యం అమ్మకాలు ప్రారంభించేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతులిచ్చింది.