ఏపీకి 25 లక్షల ఇళ్లు మంజూరు.. కేంద్రం కీలక ప్రకటన

by srinivas |
ఏపీకి 25 లక్షల ఇళ్లు మంజూరు.. కేంద్రం కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో సీఎం జగన్ 30 లక్షలు ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెబుతుంటారు. అయితే ఇళ్లు మాత్రం కట్టివ్వలేదు. ఎక్కడో ఒకటి రెండు చోట్ల మాత్రం ఇళ్లు నిర్మించింది. కానీ కేంద్రం మాత్రం రాష్ట్రానికి 25 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. ఈ విషయం స్వయంగా కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. కేవలం స్థలం మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోలేదని ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు 25 లక్షల ఇళ్లు మంజూరు చేసినట్లు ఆయన చెప్పారు. జగన్ ఇళ్ల స్థలాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని రాజ్ నాథ్ సింగ్ ఎద్దేవా చేశారు. ఏపీ ప్రగతిలో కేంద్రం పాత్ర కీలకమని చెప్పారు. జగన్ సొంత జిల్లా కడపలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే దేశం, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ట్రిపుల్ తలాక్ రద్దు చేయడం మహిళలకు గొప్ప ఊరటని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed