విభజన హామీలపై కేంద్రం కీలక సమావేశం.. సీఎం జగన్‌ సూచనలివే..!

by srinivas |   ( Updated:2023-11-20 15:19:13.0  )
విభజన హామీలపై కేంద్రం కీలక సమావేశం.. సీఎం జగన్‌ సూచనలివే..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ విభజన హామీలు, 13వ షెడ్యూల్ సంస్థల అంశాలపై మంగళవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశం నేపథ్యంలో సోమవారం సీఎస్ సహా ఇతర అధికారులతో సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అవుతున్న సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని తెలిపారు. కేంద్రప్రభుత్వమే విభజన హామీలు నెరవేర్చి రాష్ట్రానికి న్యాయం చేయాలన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం నిధులు వంటి అంశాలు ఇప్పటికీ నెరవేర్చలేదని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ నుంచి రావాల్సి విద్యుత్ బకాయిలు కూడా రాలేదని అధికారులకు సీఎం జగన్ పేర్కొన్నారు. రాయలసీమ-విశాఖ మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటు చేయాలన్నారు. విశాఖ రైల్వే జోన్, మెట్రోపై కేంద్రం నేతృత్వంలో జరుగుతున్న సమావేశంలో చర్చించాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.

Advertisement

Next Story

Most Viewed