‘తిరుపతి లడ్డూలో అవినీతి జరిగింది.. చంద్రబాబు చెప్పినవన్నీ నిజాలే’

by karthikeya |   ( Updated:2024-09-19 12:41:12.0  )
‘తిరుపతి లడ్డూలో అవినీతి జరిగింది.. చంద్రబాబు చెప్పినవన్నీ నిజాలే’
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీ వేంకటేశ్వరుని లడ్డూ ప్రసాదంలో అవినీతి జరిగిందంటూ టీటీడీ బోర్డు (TTD Board) మాజీ సభ్యుడు ఓవీ రమణ (ఆప్ Ramana) సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు చెప్పినవన్నీ నిజాలేనని, గత ప్రభుత్వ హయాంలో టీటీడీ లడ్డూ ప్రసాదం నాణ్యత పడిపోవడానికి అవినీతే కారణమని ఆయన అనడం ఇప్పుడు తీవ్ర దుమారానికి దారి తీసింది. కొద్ది రోజులుగా తిరుపతి లడ్డూ ప్రసాదం (Tirupati Laddu Prasadam) విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (CM Chandrababu Naidu), వైసీపీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి(YCP Rajyasabha MP YV Subbareddy) మధ్య మాటల వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. పవిత్ర తిరుమల ఆలయాన్ని వైసీపీ (YCP) ప్రభుత్వం అపవిత్రం చేసిందని, ప్రసాదంలో నాణ్యమైన నెయ్యికి బదులు జంతువుల కొవ్వు ఉపయోగించిందని చంద్రబాబు ఆరోపించగా.. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి రంగంలోకి దిగి.. చంద్రబాబువి అసత్య ఆరోపణలని, కోట్లాదిమంది హిందువుల విశ్వాసాలను ఆయన దెబ్బతీశారని, ఈ విషయంలో తాను కుటుంబంతో కలిసి భగవంతుడి సన్నిధిలో ప్రమాణం చేయడానికి సిద్ధమని, చంద్రబాబు కూడా అలా చేయడానికి సిద్ధమా? అంటూ సవాలు విసిరారు.

ఇలాంటి టైంలో ఓవీ రమణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తిరుపతి లడ్డూపై చంద్రబాబు చెప్పినవన్నీ నిజాలేనని, ఆవు నెయ్యి కాకపోవడంతోనే లడ్డూ నాణ్యత తగ్గిపోయిందని ఆయనన్నారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులు బటర్ ఆయిల్‌ను వినియోగించారని, ఓ మాజీ అధికారి కారణంగానే నెయ్యిలో కల్తీ జరిగిందని, నిజాలు మాట్లాడిన చంద్రబాబుపై విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు, వైవీ సుబ్బారెడ్డి వార్ కీలక మలుపు తీసుకున్నట్లైంది. మరి ఓవీ రమణ వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.

కాగా, నాసిరకం నెయ్యిని సరఫరా చేస్తున్నారంటూ జులైలో ఓ కాంట్రాక్టర్‌ను టీటీడీ బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. ఆ తర్వాత బెంగళూరులోని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) లిమిటెడ్ హై-గ్రేడ్ నెయ్యిని ప్రవేశపెట్టింది. కాంట్రాక్టర్ కల్తీనెయ్యిని సరఫరా చేసినట్టు నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబరేటరీస్ (NABL) కూడా నిర్ధారించింది.

Read More..

సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డ వైవీ సుబ్బారెడ్డి


Read More..

Tirumala Laddu :ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉంది.. వెలుగులోకి వచ్చిన అసలు రహస్యం ఇదే!?

Advertisement

Next Story

Most Viewed