- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tirumala Hundi Revenue: గణనీయంగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం.. ఒక్క ఆగస్టులోనే..
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరుని ఆదాయం ((Tirumala Tirupati Sri Venkateswara Swamy Revenue) గణనీయంగా పెరిగింది. గత నెల ఆగస్టు (August)లో భక్తుల రద్దీ భారీగా పెరగడంతో దానికి తగ్గట్లే హుండీ ఆదాయం (Hundi Revenue) కూడా రికార్డు స్థాయిలో నమోదైంది. ఈ మేరకు టీటీడీ ఈఓ శ్యామలరావు (TTD EO Syamalarao) వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవన్ (Tirumala Annamaiah Bhavan)లో జరిగిన డయల్ యువర్ ఈవో (Dail Your EO) కార్యక్రమంలో పాల్గొన్న శ్యామలరావు.. ఈ ఏడాది మొదటి 7 నెలల్లో హుండీ ఆదాయం రూ 795.35 కోట్లుగా ఉండగా.. ఆగస్టు నెలలో అత్యధికంగా రూ 125.67 కోట్లు హుండీ ఆదాయం నమోదైనట్లు తెలిపారు. ఇది ఈ ఏడాదిలో అత్యధికమని తెలిపారు. దీంతో తిరుమల శ్రీవారి హుండీ 8 నెలల ఆదాయం రూ. 921.02 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించారు.
ఏ నెలలో ఎంత హుండీ ఆదాయం:
- జనవరిలో రూ 116.46 కోట్లు,
- ఫిబ్రవరిలో రూ 111.71 కోట్లు,
- మార్చి నెలలో రూ 118.49 కోట్లు,
- ఏప్రిల్ నెలలో రూ 101. 63 కోట్లు,
- మే నెలలో రూ 108.28 కోట్లు,
- జూన్ నెలలో రూ 113.64 కోట్లు,
- జులై నెలలో రూ 125.35 కోట్లు,
- ఆగస్టు నెలలో రూ 125.67 కోట్లు
అంతేకాకుండా ఆగస్టు నెలలో శ్రీవారిని 22.42 లక్షల మంది భక్తులు దర్శించుకోగా.. 9.49 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని తెలిపారు. అలాగే 1.06 లక్షల లడ్డూలను విక్రయించామని, 24.33 లక్షల మంది ఒత్తులు అన్న ప్రసాదం స్వీకరించారని ఈవో శ్యామలరావు వెల్లడించారు.