Tirumala Laddu :ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉంది.. వెలుగులోకి వచ్చిన అసలు రహస్యం ఇదే!?

by Jakkula Mamatha |
Tirumala Laddu :ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉంది.. వెలుగులోకి వచ్చిన అసలు రహస్యం ఇదే!?
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుతం రాష్ట్రంలో తిరుమల లడ్డూ(Tirumala Laddu) ప్రసాదం పై వైసీపీ(YCP), టీడీపీ(TDP) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా సీఎం చంద్రబాబు(CM Chandrababu) లడ్డూ ప్రసాదం విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు(Animal fat) వాడారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఈ క్రమంలో వైవీ సుబ్బారెడ్డి సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆర్గానిక్ నెయ్యితోనే తాము నైవేద్యాలు, ప్రసాదాలు తయారు చేశామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం(Central Government) గుర్తింపు పొందిన ల్యాబ్ నివేదికలో సంచలన రహస్యాలు బయటపడ్డాయి.

గత ప్రభుత్వ హయాంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు(Animal fat) ఉన్నట్లు గుర్తించారు. జులై 8, 2024న ప్రసాదం శాంపిల్స్‌ని ల్యాబ్‌కు పంపించగా జులై 17న ఎన్డీడీబీ CALF ల్యాబ్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో ఆవు నెయ్యిలో సోయాబీన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలతోపాటు చేప నూనె, బీఫ్ టాలో(Beef tallow), పామాయిల్, పంది కొవ్వు కూడా వాడినట్లు స్పష్టమైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఎన్డీడీబీ సీఏఎల్‌ఎఫ్ ల్యాబ్ ద్వారా అసలు రహస్యం బయటపడింది.

Read More : ‘తిరుపతి లడ్డూలో అవినీతి జరిగింది.. చంద్రబాబు చెప్పినవన్నీ నిజాలే’


Advertisement

Next Story

Most Viewed