విశాఖ దక్షిణలో వార్ వన్ సైడ్ అయిపోయిందా?

by GSrikanth |
విశాఖ దక్షిణలో వార్ వన్ సైడ్ అయిపోయిందా?
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ దక్షిణంలో ఇలాంటి రోజు ఒకటొస్తుందని వైసీపీ అభ్యర్థి, శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్ కలలో కూడా ఊహించి వుండరు. వార్ వన్ సైడ్ అయిపోయి పిల్లా, పాపా, ముసలీ, ముతకా, కుర్రోళ్లు, ముసలివారు అంతా ఒకటే రాగం ఎత్తుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. "గ్లాసు సైకిల్" అంటూ సందడి చేస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు.. ఏ వీధిలో చూసినా జనసేన పాట తప్ప మరేం వినిపించని పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. వైసీపీ వ్యాన్‌లు, బళ్ళు, అసలు జెండా కనుమరుగు అయ్యారని చర్చించుకుంటున్నారు. మరోవైపు ఆ పార్టీ తరపున ఎక్కడా డబ్బులు సైతం పంచడం లేదని సమాచారం. టీడీపీ-జనసేన తరపున వేలాది మంది ఓటుకు ఇచ్చినా ఇవ్వకపోయానా ఎలాగూ గ్లాసుకే వేస్తాం అంటున్నారు. వైసీపీ వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకొని కూటమికి వేస్తామని బహిరంగంగానే చెబుతున్నారని తెలుస్తోంది.

అప్పడు 60:40.. ఇప్పుడు రివర్స్

విశాఖ జనసేన అభ్యర్థిగా వంశీకృష్ణ పేరు ఖరారు అయినప్పుడు గెలుపు అవకాశాలు 40 శాతం ఉండే అని సమాచారం. అయితే, వంశీ దూకుడు, వవన్, చంద్రబాబు సభలతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మొదటి నుంచి చిరంజీవి, పవన్ అభిమానులైన మత్స్మకారులు జనసేన పాట పాడుతున్నారు. ప్రస్తుతం ఆయన గెలిచే ఛాన్స్ 60 శాతం ఉందని తెలుస్తోంది.

Read More..

BREAKING: ఆంధ్రప్రదేశ్‌ వాసులకు MP రాహుల్ గాంధీ సంచలన హామీలు



Next Story