- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: అనకాపల్లి బాలిక హత్య కేసు నిందితుడు సురేశ్ ఆత్మహత్య..!
దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లా జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండులో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక హత్య జరిగిని విషయం తెలిసిందే. అయితే ఈ హత్య కేసు నిందితుడు సురేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తులో నిందితుడు సురేశ్ రాసిన 13 పేజీల లేఖ లభ్యం అయింది. ఉంటే తామిద్దరం కలిసి ఉండాలని, లేనిపక్షంలో చనిపోవాలని ఆ లేఖలో రాసి ఉంది. అందరూ క్షమించాలని సైతం సురేశ్ కోరారు. దీంతో నిందితుడు సురేశ్ చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు రాంబిల్లి పరిధిలోని కాలువు, నీటి కుంటలు, చెరువుల్లో గాలిస్తున్నారు.
కాగా కశింకోటకు చెందిన సురేశ్ కొప్పుగుండు గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి చదువుతుకున్న బాలికను పాఠశాల సమీపంలో హత్య చేశారు. అత్యంత దారుణంగా వేటకొడవలితో నరికి చంపాడు. కొప్పుగుండులోని అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటూ సురేశ్ జులాయిగా తిరిగేవారు. అయితే అదే గ్రామానికి చెందిన బాలిక వెంట సురేశ్ వెంటపడేవారు. తనను ప్రేమించాలని ప్రతి రోజూ వేధించేవారు. దీంతో బాధితులరాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
అయితే బెయిల్‌పై విడుదలైన సురేశ్ జులై 7న కొప్పుగుండు జిల్లా పరిషత్ పాఠశాల వద్ద కాపు కాసి స్కూలుకు వెళ్లిన బాలికపై వేడకొడవలితో విచక్షణరహితంగా దాడి చేశారు. ఈ దాడిలో బాలిక మృతి చెందింది. అనంతరం సురేశ్ అక్కడి నుంచి పరారయ్యారు. అయితే సురేశ్ కోసం గాలిస్తుండగా నిందితుడు రాసిన 13 పేజీల లేఖ పోలీసులకు లభ్యమైంది. దీంతో సురేశ్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.