Nandyal: మహానందిలో చిరుత పులి సంచారం.. భయాందోళనలో భక్తులు

by srinivas |   ( Updated:2024-06-29 14:46:51.0  )
Nandyal: మహానందిలో చిరుత పులి సంచారం.. భయాందోళనలో భక్తులు
X

దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లా మహానందిలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. ఇటీవల కాలంలో గోశాల సమీపంలో చిరుత తిరుగుతున్నట్లు స్థానికులు గుర్తించారు. అయితే చిరుత నడిచిన అనవాళ్లు స్పష్టంగా లేకకపోవడంతో ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా గోశాల సమీపంలో చిరుత పులి సంచరిస్తుండగా స్థానిక సీసీ ఫుటేజ్‌లో దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ మేరకు చిరుత పులి గోశాల సమీపంలో సంచరిస్తున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో భక్తులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏం చేస్తుందోనని భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ సిబ్బంది స్పందించి చిరుతను బంధించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. మరో వైపు చిరుతపులులు, ఏనుగులు స్థానిక అటవీ ప్రాంతాల నుంచి జనారణ్యంలోకి వస్తున్నాయి. ఇటువంటి ఘటనలు ఈ మధ్య మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లో జంతువులకు సరైన ఆహారం దొరకకపోవడంతోనే గ్రామాలవైపు వస్తున్నాయని పలువురు అంటున్నారు. అడవి జంతువులు గ్రామాల వైపు రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed