- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీలో వర్గ విబేధాలు.. కారణం ఆయనేనట..?
దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల వేళ నెల్లూరు జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. జలదంకి మండలం లింగరాజు అగ్రహారంలో ఆ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమం రసాభాసగా మారింది. ప్రచారం ప్రారంభించగానే నాయకులు రెండు వర్గాలుగా చిలిపోయి ఘర్షణకు దిగారు. పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు. ఆ సయమంలో ఉదయగిరి అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి అక్కడి వచ్చారు. కానీ నాయకుల ఘర్షణను చూసి కారు దిగకుండా వెళ్లిపోయారు. దీంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతుంటే ఎమ్మెల్యే అభ్యర్థి కనీసం పట్టుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. అసలు మేకపాటి రాజగోపాల్ రెడ్డి తీరుతో వైసీపీలో వర్గ విభేదాలు తలెత్తాయని, పార్టీలో గందరగోళం నెలకొందని అంటున్నారు. మరోవర్గం అయితే ఏకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. అధికార పార్టీ అగ్ర నేతల నుంచి పిలుపు వస్తే చర్చిస్తామని, లేనిపక్షంలో వైసీపీకి రాజీనామా చేస్తామని తెలిపారు. కూటమిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.