- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News:‘మదనపల్లె ఘటనలో నిందితులను వదిలిపెట్టం’ ..మంత్రి అనగాని సంచలన వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్:ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలు కీలక ఫైళ్లు దగ్ధం అయ్యాయి. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో తాజాగా మంత్రి అనగాని సత్యప్రసాద్ ఘటనపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి, స్థానిక వైసీపీ నేతలపై అనుమానం ఉందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఈ కేసులో నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. పెద్దిరెడ్డి అవినీతి వెలుగులోకి వచ్చాకే ఈ ఘటన జరింగిందన్నారు. ఆర్డీవో, తహశీల్దార్, ఉద్యోగుల ఫోన్లు సీజ్ చేసినట్లు చెప్పారు. అవినీతిని కప్పిపుచ్చేలా ఉద్యోగులు సహకరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని రెవెన్యూ కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించగా..డీజీపీ ద్వారకా తిరుమలరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Read More..
Sub Collectorate fire : మదనపల్లి సబ్ కలెక్టరేట్ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూట్ కాదని నిర్ధారణ