- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విజయవాడ సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో సిపి క్రాంతి రానా టాటా కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీపీని కలిసేందుకు వడ్డెర కుల సంఘం నేతలు భారీగా చేరుకున్నారు. అయితే అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. జగన్‌పై దాడి కేసులో A2 నిందితుడుగా దుర్గారావు ఉన్నారు. ఈ మేరకు ఆయనను తమకు చూపించాలని సిపి క్రాంతి రానా టాటా కార్యాయలయం వద్ద భార్య , కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఆటోలో పోలీసు స్టేషన్‌కు తరలించారు.
కాగా విజయవాడ సింగ్‌నగర్‌లో సీఎం జగన్ మోహన్ రెడ్డిపై గులకరాయితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో సీఎం జగన్ కంటిపై భాగాన గాయమైంది. అయితే ఈ దాడికి పాల్పడిన వడ్డెర కులానికి చెందిన సతీశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఏ2 నిందితుడిగా ఉన్న దుర్గారావును పోలీసులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో దుర్గారావు భార్య, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. దుర్గారావును రహస్యంగా విచారిస్తుండటంతో ఆయన ప్రాణానికి హాని ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసు ఒప్పుకోవాలంటూ దుర్గారావుపై పోలీసులు ఒత్తిడి చేస్తున్నారంటూ ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
సిపి కార్యాలయం వద్ద ఉద్రిక్తత..
— Chakri Movva (@ChakriMovva) April 20, 2024
సిపి క్రాంతి రానా టాటా ను కలిసేందుకు భారీగా చేరుకున్న వడ్డెర కుల సంఘం నేతలు..
అనుమతి లేదని కార్యాలయం వద్ద అడ్డుకున్న పోలీసులు..
జగన్ దాడి కేసులోని A2 నిందితుడుగా ఉన్న దుర్గారావును తమకు చూపించాలని భార్య , కుటుంబ సభ్యులు ఆందోళన..
ఆందోళనకారులను… pic.twitter.com/bWIWfFTkLz