AP : మాచర్లలో ఉద్రిక్త పరిస్థితులు.. కొనసాగుతున్న హై టెన్షన్!

by Rajesh |
AP : మాచర్లలో ఉద్రిక్త పరిస్థితులు.. కొనసాగుతున్న హై టెన్షన్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పలు చోట్లు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పల్నాడు జిల్లా మాచర్లలో ఇప్పటికి పరిస్థితి అదుపులోకి రాలేదు. పోలింగ్ రోజు చెలరేగిన హింస ఇంకా కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే పల్నాడులో 144 సెక్షన్ కొనసాగుతోంది. గురజాల, మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ దాడులు, ప్రతిదాడులకు పాల్పడింది.

దీంతో అడుగడునా పోలీసు బలగాలను మోహరించారు. ఇప్పటికీ స్థానిక షాపులు తెరుచుకోలేదు. పల్నాడులో 2 వేల మంది పోలీసులు పహారా కాస్తున్నారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు మాచర్లలో డీఐజీ త్రిపాఠి మాకాం వేశారు. మాచర్ల, రెంటాలలో పోలింగ్ సమయంలో వైసీపీ నేతల దాడిలో టీడీపీ కార్యకర్త మంజుల గాయపడ్డారు. పోలింగ్ రోజు కత్తులతో ముంజులపై దాడి జరిగింది. గుంటూరు ఆస్పత్రిలో మంజుల చికిత్స పొందుతున్నారు. తమను అంతుచేయాలనే కత్తులతో దాడి చేశారని తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి దాడులు జరగలేదన్నారు.

Advertisement

Next Story

Most Viewed