నీ జీవితంలో అసలు నిజం అనేది ఉందా..? లోకేశ్ అంటే అంత భయమా జగన్

by Anjali |   ( Updated:2024-08-27 15:41:53.0  )
నీ జీవితంలో అసలు నిజం అనేది ఉందా..? లోకేశ్ అంటే అంత భయమా జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 28 వ తారీకు కేబినెట్ భేటీ ఉంది. కానీ మంత్రి నారా లోకేశ్ లేకపోవడంతో కేబినెట్ భేటీ రద్దు చేశారని వైసీపీ ట్వీట్ చేసింది. ‘లోకేష్ కోసం మరోసారి కేబినెట్ వాయిదా వేసింది. తొలుత ఈరోజు కేబినెట్ సమావేశం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. లోకేశ్ విహార యాత్ర ఉందని తెలియక సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు పంపారు. మళ్లీ లోకేష్ కోసం కేబినెట్ తేదీని సీఎస్ మార్చారు. రేపు క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

ఒకే నెలలో రెండు సార్లు లోకేశ్ కోసం కేబినెట్ సమావేశంలో మార్పులు జరిగాయి. ఈ నెల రెండో తేదీ జరగాల్సిన కేబినెట్ ని 7 వ తేదీకి మార్చారు. లోకేశ్ విదేశీ విహార యాత్ర కోసం ప్రభుత్వం కేబినెట్ తేదీని మార్చింది. తాజాగా మళ్లీ ఇదే నెలలో నేడు జరగాల్సిన కేబినెట్ రేపటికి సీఎం చంద్రబాబు మార్చారు. కొడుకు కాబట్టి కేబినెట్ మార్చాల్సి వస్తోందని అధికారుల్లో చర్చ నడుస్తోంది. ఒక మంత్రి కోసం కేబినెట్ మార్చడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమమని అధికారులు అంటున్నారు’.

అని వైసీపీ ట్వీట్‌ చేసింది. దీనికి తెలుగు దేశం పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ మరో ట్వీట్ పెట్టింది. ‘నీ బతుకు మొత్తంలో ఒక్క నిజం అయినా ఉందా ? మొత్తం ఫేకేనా, ఫేక్ జగన్. 28వ తేదీ కేబినెట్ ఉన్నట్లు 16వ తేదీన వచ్చిన సర్క్యులర్ ఇది. కొద్దిగా పొద్దున్నే అశుద్ధం తినటం మాని, అన్నం తిను. అప్పుడైనా నీతిగా బతకాలనే ఆలోచన నీకు వస్తుందేమో. అయినా లోకేశ్ అంటే ఎందుకు ఇంతలా భయపడుతున్నావ్ ? బెంగళూరులో దాక్కుని కూడా లోకేశ్ అంటే ఇంత భయమా?’ అంటూ టీడీపీ ట్వీట్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed