- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కడప జిల్లాలో భారీగా ఎర్రచందనం డంప్ పట్టివేత.. స్మగ్లర్ అరెస్ట్
దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా పోరుమామిళ్ల అటవీప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. భారీగా డంప్ చేసిన ఎర్రచందనం దుంగలను గుర్తించారు. పక్కాగా సమాచారం రావడంతో రైడ్ చేశారు. ఈ దాడిలో 101 ఎర్రచందనం దుంగలతో పాటు లారీ, రెండు బైకులను స్వాధీనం చేశారు. ఎర్రచందనం స్మగ్లర్‌ను అరెస్ట్ చేశారు. ఈ డంప్ వెనుక ఎవరున్నారనే కోణంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా స్మగ్లర్లకు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేసేందుకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటవీ ప్రాంతంలో ఎర్రచందనం సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని పోరుమామిళ్ల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ప్రస్తుతం పట్టుకున్న ఎర్రచందనం దుంగలతో పాటు లారీ, రెండు బైకులను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడి విచారణ తర్వాత కోర్టులో ప్రవేశ పెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.