- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తీర్పుపై ఉత్కంఠ: ఏపీ ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలో నేడు కీలక పరిణామం
దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ ఫైబర్ గ్రిడ్ కుంభకోణం కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఫైబర్ గ్రిడ్ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన వారి ఆస్తుల అటాచ్‌మెంట్‌పై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనన్న టెన్షన్ నెలకొంది. ఇకపోతే ఈ ఫైబర్ గ్రిడ్ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినవారి ఆస్తుల అటాచ్ మెంట్‌కు సీఐడీ సిద్ధమైంది. ఈ మేరకు అనుమతి కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు శుక్రవారం విచారించనుంది. ఫైబర్ గ్రిడ్ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్ మెంట్‌కు వైసీపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ సీఐడీకి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విజయవాడ ఏసీబీ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో న్యాయస్థానం అనుమతి కోరుతూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన విజయవాడ ఏసీబీ కోర్టు విచారణను ఈనెల 17కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
ఆస్తుల అటాచ్‌కు సీఐడీ నిర్ణయం
తెలుగుదేశం పార్టీ హయాంలో ఏపీ ఫైబర్ గ్రిడ్ కుంభకోణం జరిగిందని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ మేరకు సీఐడీకి ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు కొనసాగుతుంది. కేసు విచారణలో భాగంగా ఈ ఫైబర్ గ్రిడ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు,నారా లోకేశ్‌తోపాటు మరికొందరిపై సీఐడీ కేసులు నమోదు చేసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సన్నిహితులకు లాభం చేకూర్చేలా ఏపీ ఫైబర్ గ్రిడ్ విషయంలో వ్యవహరించారని సీఐడీ ఆరోపిస్తోంది. అక్రమాలకు పాల్పడిన టెరాసాప్ట్‌తో పాటు వేమూరి హరిప్రసాద్‌కు చెందిన ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలని సీఐడీ భావించింది. వీటితోపాటు విశాఖపట్నం, గుంటూరుతో పాటు హైదరాబాద్‌లోని దాదాపు రూ.114 కోట్ల ఆస్తుల జప్తుకు సీఐడీ సన్నద్ధమవుతుంది. అయితే కోర్టు తీర్పు ఎలా ఉంటుందో అన్న దానిపై అటు సీఐడీ, ఇటు చంద్రబాబు నాయుడుతోపాటు నిందితుల్లో టెన్షన్ నెలకొంది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడును మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీసేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబుపై కేసులు పెట్టడం, ఆస్తులను జప్తు చేయడం చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది.