తూ.గో జిల్లాలో పురంధేశ్వరిని తిరగనివ్వొద్దు.. సుంకర పద్మశ్రీ సంచలన వ్యాఖ్యలు

by Satheesh |
తూ.గో జిల్లాలో పురంధేశ్వరిని తిరగనివ్వొద్దు.. సుంకర పద్మశ్రీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల వేడీ రాజుకుంది. అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు పురంధేశ్వరి నమ్మక ద్రోహం చేశారని ఫైర్ అయ్యారు. తూర్పు గోదావరి జిల్లాలో పురంధేశ్వరిని తిరిగనివ్వొద్దని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. పురంధేశ్వరికి రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని పద్మశ్రీ గుర్తు చేశారు. సోనియా గాంధీ ఆమెకు చాలా ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. ఆస్తులు కాపాడుకోవడానికే పురంధేశ్వరి కన్నతల్లిలాంటి కాంగ్రెస్ పార్టీని మోసం చేసిందని ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి.. ఏపీకి ప్రత్యేక హోదా.. విభజన హామీలపై రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చాకే ఆమె మాట్లాడాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed