టెట్ ఫలితాలు.. 150కి 150 మార్కులు సాధించిన అభ్యర్థులు

by Mahesh |
టెట్ ఫలితాలు.. 150కి 150 మార్కులు సాధించిన అభ్యర్థులు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET-2024) ఫలితాలను ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సోమవారం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ముగ్గురు పేద అభ్యర్థులు 100 శాతం ఫలితాలు సాధించి చరిత్ర సృష్టించారు. మొత్తం 150 మార్కులకు గాను 150 మార్కులను ముగ్గురు అభ్యర్థులు సాధించారు. వారు.. విజయనగరానికి చెందిన కొండ్రు అశ్విని, నంద్యాల(డి)గొర్విమానుపల్లె వాసి మంజుల, నిచ్చెనమెట్లకు చెందిన క్రాంతికుమార్ లు 150కి 150 మార్కులతో వంద శాతం మార్కులు సాధించారు. ఈ ముగ్గురు అభ్యర్థుల తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకునే వారని తెలుస్తుంది. టెట్ ఫలితాల్లో వంద శాతం ఫలితాలతో.. టీచర్ ఉద్యోగం సాధించిన వారు స్పందిస్తూ... పేద విద్యార్థులకు ఉత్తమ బోధన అందించడమే లక్ష్యమని చెప్పుకొచ్చారు.

సోమవారం రోజు మంత్రి లోకేష్ విడుదల చేసిన.. టెట్ ఫలితాలకు సంబంధించిన పరిక్షలు.. అక్టోబర్ 3 నుంచి 21 వరకు రోజుకు రెండు సెషన్ల చొప్పున ఉన్నత విద్యా శాఖ టెట్‌ పరీక్షలను (TET Exams) అత్యంత పకడ్బందీగా నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 3,68,661 మంది హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్ష రాసేందుకు 4,27,300 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 1,87,256 (50.79 శాతం) మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లుగా అధికారులు వెల్లడించారు. అయితే, డీఎస్సీ (DSC)లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. కాగా, త్వరలోనే ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ (Mega DSC) నోటిఫికేషన్ విడుదల చేయనుంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫైనల్‌ కీ (Final Key), ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలను https://aptet.apcfss.in/ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed