- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీకి షాక్
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖలో వివాదాస్పద సిబిసిఎన్‌సి క్రైస్తవ సంస్థ భూముల్లో బహుళ అంతస్తుల భవనాల నిర్మించేందుకు మైనింగ్ చేసిన వైసీపీకి చెందిన మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు మైనింగ్ శాఖ షాక్ ఇచ్చింది. నగరం నడిబొట్టున ఉన్న ఈ స్థలంలో భారీ ఎత్తున తవ్వకాలు, పేలుళ్లు జరిపి అక్రమాలకు పాల్పడినందున సుమారు రెండు కోట్ల రూపాయలను జరిమానా చెల్లించాలంటూ విశాఖ మైనింగ్ శాఖ అధికారులు సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
పనులు నిలిపివేయమన్న జీవీఎంసీ
ఇప్పటికే మహా విశాఖ నగరపాలక సంస్థ సిపిసిఎన్‌సి స్థలంలో పనులను నిలిపివేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలను ఉల్లంఘించినందున తక్షణమే పనులు ఆపాలంటూ జీవీఎంసీ వారం రోజుల క్రితమే ఆదేశాలు జారీ చేసింది. తాజాగా మైనింగ్ శాఖ కూడా రంగంలోకి దిగడంతో ఇక్కడ ఎంవివి సత్యనారాయణ " ఎంవివి పీక్" పేరిట నిర్మిస్తున్న బహుళ అంతస్తుల నిర్మాణం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఆయన నిర్మిస్తున్న మరో వివాదాస్పద ప్రాజెక్టు హయగ్రీవ లో నిర్మాణాలు ఆపివేయాలంటూ తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి.