Breaking News: వాటిపై పేటెంట్ పొందిన సీఎం జగన్

by Indraja |   ( Updated:2024-03-07 12:28:07.0  )
Breaking News: వాటిపై పేటెంట్ పొందిన సీఎం జగన్
X

దిశ డైనమిక్ బ్యూరో: రానున్న ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జోరందుకుంది. రానున్న ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అడుగులేస్తున్న టీడీపీ అధిష్టానం ప్రజలను ఆకర్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను, బహిరంగ సభలను టీడీపీ నిర్వహిస్తోంది. రోజు హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ శంఖారావం బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో నష్టపోయింది బడుగు, బలహీన వర్గాలే అని ఆరోపించారు. అలానే వైసీపీ దురాగతాలకు ప్రజాకోర్టులో శిక్షపడే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఇక దోచుకో.. పంచుకో.. తిను పేటెంట్ జగన్‌ రెడ్డిదే అని ఎద్దేవ చేసారు. తన దోపిడీని ఎదుటివారికి అంటగట్టి అబద్ధాలు చెప్పడమే జగన్‌ నైజమని మండిపడ్డారు.

ఇక ప్రభుత్వం ఇంటికెళ్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని లేకపోతే రాష్ట్రంలో అభివృద్ధి ఉండదని తెలిపారు. ఇక టీడీపీ పాలనలో బీసీలకు న్యాయం జరగడంతో పాటుగా అభివృద్ధి, పాలనలో భాగస్వామ్యం దక్కుతుందని హామీ ఇచ్చారు.

Read More..

అన్నవరం అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్ శంకుస్థాపన

Advertisement

Next Story