CID:డిస్టిలరీల్లో సీఐడీ అధికారుల సోదాలు

by Jakkula Mamatha |
CID:డిస్టిలరీల్లో సీఐడీ అధికారుల సోదాలు
X

దిశ ప్రతినిధి,కాకినాడ: కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం చినబ్రహ్మదేవంలోని కేబికే (కందుల బలరామ కృష్ణ) బయోటెక్ పరిశ్రమలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. డిస్టిలరీలకు ఎంత మొత్తంలో మద్యం సరఫరా అయింది, నిల్వ, సరఫరా తదితర వివరాలు రికార్డులను అధికారులు పరిశీలించారు. కంపెనీలో బుధవారం సోదాలు చేస్తున్న 8 మంది సీఐడీ అధికారుల్లో ఒక డీఎస్పీ స్థాయి అధికారితో పాటు ఇద్దరు సీఐలు ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. పోర్టబుల్ ఆల్కహాల్, ఇథనాల్, శానిటైజర్, ఫీడ్, ఫార్మా, గ్యాస్ ప్రోడక్ట్ ఈ కంపెనీలో తయారవుతున్న దృష్ట్యా ఈ సోదాలకు ప్రాధాన్యత లభించింది.

Advertisement

Next Story

Most Viewed