ఇసుక కుంభకోణం కేసు: చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

by Seetharam |
ఇసుక కుంభకోణం కేసు: చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఇసుక కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఇరువైపుల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం కేసుల విచారణను వాయిదా వేసింది. చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో తదుపరి వాదనలను అడ్వకేట్‌ జనరల్‌ వినిపించనున్నారు. ఈ కేసులో చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఇసుక కుంభకోణం అంటూ సీఐడీ చేస్తున్న ఆరోపణలలో ఎలాంటి ఆధారాలు లేవని వాదించారు. 17 -ఏ నిబంధన ప్రకారం అభియోగాలు నమోదుకు గవర్నర్‌ అనుమతి తీసుకోలేదని వాదించారు. ప్రభుత్వం నిర్ణయాన్ని క్రిమినల్ కేసు ద్వారా విచారణ జరపకూడదని చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదించారు. ఉచితంగా ఇసుకను ఇచ్చారు కాబట్టి ఖజానాకు నష్టం జరిగిందని అనడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అది ప్రభుత్వ నిర్ణయం, సామాన్యులకు మేలు చేయాలనే ఉద్దేశంతో చేసిన నిర్ణయంగానే చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం విధానపరంగా తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టేందుకు ఏముంటుందని కోర్టును ప్రశ్నించారు. ఉచిత ఇసుక అనేది ఏవిధంగానూ చట్ట విరుద్ధం కాదని వాదనలు వినిపించారు. ఇసుక ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో పేదలకు, భవన నిర్మాణ పనులకు అందుబాటులో ఉండేలా అప్పటి ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇవ్వాలని ఈ విధాన పరమైన నిర్ణయం తీసుకుందని చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. ఇరు వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed