Breaking: ఆర్ నారాయణ మూర్తిని అవమానించిన మంత్రి రోజా.. వీడియో వైరల్

by Indraja |
Breaking: ఆర్ నారాయణ మూర్తిని అవమానించిన మంత్రి రోజా.. వీడియో వైరల్
X

దిశ డైనమిక్ బ్యూరో: ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రముఖ పార్టీల అధినేతలు ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. భహిరంగ సభలు పెట్టి తాము అధికారంలోకి వస్తే ప్రజలకు జరిగే మంచి గురించి చెప్తూ ప్రత్యర్థుల పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఒకప్పటి హీరోయిన్ ప్రస్తుత మంత్రి ఆర్కే రోజా మాత్రం ప్రత్యర్థులను విమర్శించే క్రమంలో రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులను కూడా అవమానిస్తూ మాట్లాడుతున్నారు.

తాజాగా రోజా మాట్లాడుతూ విడుదల చేసిన వీడియో సమాజం కోసం సర్వం త్యాగం చేసేందుకు కూడా వెనకాడని ప్రముఖ విప్లవ సినీనటుడు ఆర్ నారాయణ మూర్తిని అవమానించేలా ఉంది. ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ ఫ్రస్టేషన్ తార స్థాయికి వెళ్లినట్లు తనకి నిన్న పవన్ నిర్వహించిన సభను చూస్తే అర్థమైందని పేర్కొన్నారు. ఇక ఆవేశంగా ఊగితేనో, గట్టిగా అరిసి మాట్లాడితే ఓట్లు పడతాయంటే.. ఆర్ నారాయణ మూర్తి ఎప్పుడో ప్రధానమంత్రి అయ్యి ఉండేవారని ఎద్దేవ చేశారు.

అయితే ఈ వీడియో చూసిన నెటిజన్స్ రోజా పై కామెంట్ల రూపంలో విరుచుకుపడుతున్నారు. అసలు ఆర్ నారాయణ మూర్తి గారికి రాజకీయాలకు ఏం సంబంధం ఉంది. ఆయన సినిమాల్లో అరుస్తారు.. కాని ఆయన తీసే ప్రతి సినిమా సమాజానికి పనికి వచ్చేలా ఉంటుంది. మీలా పదవుల కోసం ఒకరికి భజన చెయ్యరు. మంత్రివి కాస్త మంత్రి లా కాకపోయినా మహిళలా కనిపించేందుకు ప్రయత్నించ్చు అంటూ కామెంట్లు చేస్తున్నారు.


Advertisement

Next Story

Most Viewed