బయటకు వెళ్తున్నారా..? అయితే జాగ్రత్తలు తప్పనిసరి

by Anjali |
బయటకు వెళ్తున్నారా..? అయితే జాగ్రత్తలు తప్పనిసరి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఫిబ్రవరి చివరి వారం నుంచే ఉష్ణోగ్రతల తీవ్రత అధికంగా నమోదు అవుతుంది. సూర్యుడి నుంచి వెలువడుతున్న వేడిమిని తట్టుకోలేక ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఇక రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎండలు సగటున 2 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నట్లు IMD తెలిపింది. నిన్న రెంటచింతలలో 42.6, నెల్లిమర్లలో 41.9, రాజాంలో 41.8, కర్నూలులో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అడ్డతీగల, నెల్లిపాక, చింతూరు, గంగవరం, నర్సీపట్నం, మాకవరపాలెం సహా 26 మండలాల్లో నేడు వడగాడ్పులు వీచే అవకాశం ఉందని IMD పేర్కొంది. అత్యవసరమైతేనే ప్రజలు బయటికెళ్లాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. కాగా.. నగర వాసులు ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని తగు చర్యలు తీసుకోవాలని అధికారులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed