Dy CM Pawan kalyan: రాష్ట్రంలో మద్యపాన నిషేధం సాధ్యం కాదు.. అసెంబ్లీలో పవన్ కల్యాణ్

by Mahesh |   ( Updated:2024-07-24 15:53:17.0  )
Dy CM Pawan kalyan: రాష్ట్రంలో మద్యపాన నిషేధం సాధ్యం కాదు.. అసెంబ్లీలో పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంద్రప్రదేశ్ డిప్యూటి సీఎం సవన్ కల్యాణ్ ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేశారని.. ప్రజలను కొత్త కొత్త బ్రాండ్ల మద్యానికి బానిసలుగా చేశారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో మద్యపాన నిషేధం సాధ్యం కాదని అసెంబ్లీ సాక్షిగా పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. అయితే మద్యానికి బానిసలుగా మరారని ప్రజల కోసం డీ అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై వచ్చిన ఆదాయంలో 10 శాతం డీ అడిక్షన్ సెంటర్లు నిర్వహణ కోసం ఉపయోగించాలని సభలో కోరారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖలో దోపిడీ జరిగిందని, వాటిపై సభలో తాము నిలదీస్తే సమాధానం చెప్పాల్సి వస్తుందేమోనన్న భయంతో వైసీపీ నేతలు సభకు రాకుండా తప్పించుకుని పారిపోయారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనంతరం పవన్ కల్యాణ్ విజ్ఞప్తి పై స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ లిక్కర్ పాలసీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ చేస్తామని హామీ ఇచ్చారు.

Read More..

AP liquor policy: ఏపీ మద్యం పాలసీలో అక్రమాలు.. సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం

Advertisement

Next Story

Most Viewed