ప్రజాగళం సభలో వారి పై ఫైర్ అయిన ప్రధాని మోడీ..

by Jakkula Mamatha |   ( Updated:2024-03-17 13:33:23.0  )
ప్రజాగళం సభలో వారి పై ఫైర్ అయిన ప్రధాని మోడీ..
X

దిశ, వెబ్ డెస్క్: చిలకలూరిపేట బొప్పూడి లో ఉమ్మడి ప్రజాగళం సభ నిర్వహించారు. అయితే NDA కూటమి నిర్వహిస్తున్న ప్రజాగళం సభలో కొందరు యువకులపై ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు.కొందరు అభిమానులు లైట్ ఫోల్స్ పైకి ఎక్కడంతో పవన్ ప్రసంగాన్ని ఆపిన మోడీ..దిగాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ‘‘మా కోసం వచ్చిన మీరు జాగ్రత్తగా ఉండాలి.మీ ప్రాణాలు చాలా విలువైనవి’’ అంటూ చెప్పారు.అయినా వారు వినకపోవడంతో వారిని కిందకి దించాలంటూ పోలీసులకు సూచించారు.ప్రధాని మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై హాజరవ్వడం ఇదే మొదటిసారి కావడంతో ఈ సభకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడం ఖాయం అని చెప్పారు.

Advertisement

Next Story