- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: 24 ఏళ్ల కల సాకారం..సీఎం జగన్‌కు పాలాభిషేకం
దిశ, చీరాల: 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల 24 ఏళ్ల కలను సీఎం జగన్ సాకారం చేశారని మున్సిపల్ కో-అప్షన్ సభ్యులు షేక్ హుమయూన్ కబీర్ అన్నారు. మినిమం టైం స్కేలు పద్ధతిలో 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4534 మంది అభ్యర్థులకు నియామకపు పత్రాలు వస్తాయన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చి 4534 కుటుంబాలలో వెలుగు నింపారని పేర్కొన్నారు. 1998 క్వాలిఫైడ్ అభ్యర్థుల తరఫున సీఎం జగన్‌కు హుమయూన్ కబీర్ కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం
చీరాల గడియార స్తంభం సెంటర్ వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి డీఎస్సీ 1998 ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాబోయే రోజుల్లో కూడా సీఎంగా జగన్ మోహన్ రెడ్డి కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కో అప్షన్ సభ్యులు షేక్ హుమయూన్ కబీర్, డీఎస్సీ1998 క్వాలిఫైడ్ ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.