- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Parliament Winter Session: పార్లమెంటులో అదానీ అంశంపై రగడ
దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు(Parliament Winter Session) ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. తొలుత 15 నిమిషాల పాటు ఉభయసభలను వాయిదా పడ్డాయి. ఆ తర్వాత ప్రతిపక్షాల రగడతో(uproar in Parliament) బుధవారానికి సభ వాయిదా పడింది. గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు, మణిపూర్ హింసలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు ముందుగానే నిర్ణయం తీసుకున్నాయి. అందులో భాగంగానే అదానీ అంశంపై జేపీసీ వేయాలంటూ కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. భారత్ లోని వ్యాపారలపై అదానీ గ్రూప్ ప్రభావం, ప్రభుత్వ నియంత్రణపై చర్చలు జరపాలని లోక్ సభలో(Lok Sabha) విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్ల మధ్యనే లోక్ సభ ప్రారంభమైంది. తొలుత ఇటీవలి కాలంలో చనిపోయిన సభ్యులకు సంతాపం తెలిపారు. ఆ తర్వాత అదానీ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టడంతో మధ్యాహ్నం 12 గంటల వరకు లోక్ సభను స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ ప్రతిపక్షాల రగడ కొనసాగడంతో సభను బుధవారానికి వాయిదా వేశారు.
రాజ్యసభ వాయిదా
అదానీ గ్రూప్‌పై అమెరికా న్యాయ శాఖ చేసిన లంచాల ఆరోపణలపై చర్చ జరగాలని ఎగువ సభలో(Rajya Sabha) ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే, ప్రతిపక్ష ఎంపీల ఆందోళనతో రాజ్యసభ కార్యకలాపాలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. ప్రతిపక్ష ఎంపీల నిరసనల నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ సంధ్యా రే లోక్‌సభను తిరిగి ప్రారంభమైన వెంటనే వాయిదా వేశారు. ఆతర్వాత తిరిగి సభ ప్రారంభమైంది. శాంతియుతంగా చర్చలు కొనసాగించాలని ఛైర్మన్ జగదీప్ ధన్ ఖర్ ప్రతిపక్షాలను కోరారు. అయినప్పటికీ అదానీపై చర్చ కోసం విపక్షాలు పట్టుబట్టడంతో రాజ్యసభను బుధవారానికి వాయిదా వేశారు. ఇక ఈ సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు మొత్తం 16 బిల్లులు రానున్నాయి