- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా ? బ్యాంకుల్లో వడ్డీరేట్లు ఎలా ఉన్నాయంటే..?
దిశ, వెబ్‌డెస్క్ : గోల్డ్ లోన్(Gold Loan) ఎమర్జెన్సీ సమయంలో ఎంతోమందిని ఆదుకునేందుకు అత్యంత సురక్షిత మార్గం. సాధ్యమైనంత త్వరగా డబ్బులు అవసరమైనప్పుడు ఇది ఒక ఉత్తమ ఆప్షన్ గా ఉంటుంది. ఆస్తిని అమ్మకుండా, నిధులను సమకూర్చునే తెలివైన పద్ధతి గోల్డ్ లోన్. మన దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు (Gold ornaments)లేదా నాణేలు, తనఖా పెట్టి బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నుంచి లోన్ తీసుకోవచ్చు. వెంటనే డబ్బును పొంది.. స్వల్పకాలిక ఆర్థిక అవసరాలను తీర్చుకోవచ్చు. లోన్ పూర్తిగా తిరిగి చెల్లించి బంగారాన్ని తనఖా నుంచి విడిపించుకోవచ్చు.
అయితే గోల్డ్ లోన్ తీసుకోవాలంటే అన్ని రకాల బంగారం పనికిరాదు. అన్ని బ్యాంకులు బంగారు ఆభరణాలపై లోన్ ఇస్తుంటాయి. తనఖా పెట్టే బంగారం క్వాలిటీ 18 క్యారెట్ల(18 carat gold) నుంచి 22క్యారెట్ల (22 carat gold) మధ్యలో ఉండాలని చెబుతుంటారు. ఎస్బిఐలో అయితే బంగారు ఆభరణాలతో పాటు బంగారు నాణాలను కూడా పెట్టొచ్చు.
గోల్డ్ లోన్ తీసుకున్న వారి నుంచి లోన్ వసూళ్లకు బుల్లెట్ రీపేమెంట్(Bullet repayment) పద్ధతి ఉపయోగిస్తుంటారు. గోల్డ్ పై లోన్ తీసుకునే వ్యక్తి నుంచి ఆ మొత్తం వసూలు చేసే క్రమంలో వడ్డీతో పాటు అసలు కలిపి తీసుకునే పద్ధతిని బుల్లెట్ రీపేమెంట్ అంటారు. గోల్డ్ పై తీసుకున్న వ్యక్తి లోన్ తీర్చడానికి రుణ గ్రహీత ఎన్ని నెలలు అయితే సమయాన్ని తీసుకున్నారో అన్ని నెలలకు వడ్డీని లెక్కిస్తారు. వడ్డీ రేటు అనేది బ్యాంకు, ఆర్థిక సంస్థలను బట్టి ఉంటుంది. ఒకే చెల్లింపులో గోల్డ్ లోన్ మొత్తం తీర్చేసే పద్ధతి కావడం వల్ల దీనికి బుల్లెట్ రీపేమెంట్ అనే పేరు వచ్చింది. 3 నెలలు, 6 నెలలు, 12 నెలల కాల వ్యవధి కోసం బుల్లెట్ రీపేమెంట్ ప్లాన్ కొన్ని బ్యాంకులు అందిస్తుంటాయి.
గోల్డ్ ఫైల్ లోన్ తీసుకునేటప్పుడు వడ్డీ రేటు ఒక్క దాన్నే చూడకూడదు. వడ్డీ రేట్లు ఇతర చార్జీలను కూడా విధించే సమాచారాన్ని సేకరించాలి. మనం ఎంత కాలానికి బంగారాన్ని తాకట్టు పెడుతున్నాం. అంత కాలంలో ఎంత మేర వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. అనే వివరాలను అంచనాకు వచ్చేంతవరకు ఆన్లైన్ క్యాలిక్యులేటర్ల(Online calculators)ను వాడుకోవాలి.
ఏ బ్యాంకులో ఎంత వడ్డీరేట్లు ఉన్నాయంటే?
ఇండియన్ బ్యాంకు(Indian Bank)లో గోల్డ్ లోన్ పై వడ్డీ రేటు 8.80 నుంచి శాతం దాకా ఉంటుంది. దీంతోపాటు 0.5శాతం ప్రాసెసింగ్ ఫీజు(Processing fee) కూడా వసూలు చేస్తారు. ఫెడరల్ బ్యాంకు(Federal Bank)లో వడ్డీ రేటు 8.9శాతం ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా(Bank of Baroda)లో 9.5శాతం.. కెనరా బ్యాంకు(Canara Bank)లో 9శాతం.. యూనియన్ బ్యాంకు(Union Bank) లో 9.95శాతం.. పంజాబ్ నేషనల్ బ్యాంకు(Punjab National Bank)లో 12.25శాతం.. కరూర్ వైశ్యా బ్యాంకు(Karur Vysya Bank)లో 10.65శాతం.. ఐసీఐసీఐ బ్యాంకు(ICICI Bank)లో 9.25శాతం HDFC బ్యాంకు(HDFC Bank)లో 9.3శాతం.. కోటక్ మహీంద్రా బ్యాంకు(Kotak Mahindra Bank)లో 0.8శాతం.. ఇండస్ ఇండ్ బ్యాంకు(Indus Ind Bank)లో 10.35శాతం.. యాక్సిస్ బ్యాంకు(Axis Bank)లో 17శాతం.. బంధన్ బ్యాంకు(Bandhan Bank)లో 10.5శాతం.. సిటి యూనియన్ బ్యాంక్(City Union Bank) లో 9.5శాతం వడ్డీరేట్లు ఉన్నాయి.
ఇక ముత్తూట్ ఫైనాన్స్(Muthoot Finance) లో అత్యధికంగా సంవత్సరానికి 22శాతం దాకా వడ్డీ రేటు ఉంటుంది. ప్రతినెల 100 శాతం వడ్డీని చెల్లిస్తేనే రెండు శాతం రిబేట్ ఇస్తారు.
- Tags
- Gold Loan Interest Rates 2025
- Gold Loan Interest Rate Bank Vis
- Lowest Gold Loan Interest Rate
- Gold Loan Interest Rates
- interest rates
- gold loan interest rate 2025
- gold loan interest rate in all banks 2025
- gold loan interest rate
- gold loan interest rate in all banks
- sbi gold loan interest rate
- sbi gold loan interest rates 2024
- canara bank gold loan interest rates 2024
- sbi gold loan interest rates 2025
- gold loan interest
- home loan interest rates
- gold loan interest calculation formula
- sbi gold loan interest
- gold loans with lowest interest rates
- gold loans