Beerla Ilaiah: కేటీఆర్ సిగ్గులేకుండా మళ్లీ మాట్లాడుతున్నావా?.. బీర్ల ఐలయ్య ఫైర్

by Prasad Jukanti |   ( Updated:2025-01-09 07:50:28.0  )
Beerla Ilaiah: కేటీఆర్ సిగ్గులేకుండా మళ్లీ మాట్లాడుతున్నావా?.. బీర్ల ఐలయ్య ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచ దేశాల్లో తెలంగాణ పరువు తీసి మళ్లీ సిగ్గులేకుండా లేకుండా కేటీఆర్ (KTR) మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య (Birla Ilaiah) విమర్శించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విదేశీ సంస్థలకు రూ. 55 కోట్లు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) నోరు జారితే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. అధికారం పోయిందననే అక్కసుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ నోరు జారుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం అని ఇకనైనా కేటీఆర్ తన బుద్ధిని మార్చుకోవాలన్నారు. మీరు చేసిన అప్పులను, తప్పులను ఒక్కొక్కటిగా సరిదిద్దుతూ రేవంత్ రెడ్డి ప్రజాపాలన అందిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్నీ ఛీ కొట్టి ఇంట్లో కూర్చోబెట్టినా, జైలుకు వెళ్తూ వెళ్తూ సీఎంపై నోరు జారితే జాగ్రత్త అని హెచ్చరించారు. మతి భ్రమించి మాట్లాడుతున్న కేటీఆర్ కు, బీఆర్ఎస్ పార్టీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం అన్నారు.

Advertisement

Next Story