రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని మృతదేహం లభ్యం..

by Aamani |
రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని మృతదేహం లభ్యం..
X

దిశ, కేసముద్రం: తాళ్ల పూస పల్లి-కేసముద్రం రైల్వే స్టేషన్ ల మధ్య గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది.తేదీ 08 బుధవారం రోజున సుమారు సాయంత్రం 07:00 గంటల కంటే ముందు ఒక గుర్తు తెలియని పురుషుడు వయస్సు సుమారు 35-40 సంవత్సరాలు, కే.ఎం.నం 424/9-7 అప్ లైన్ తాళ్ల పూస పల్లి-కేసముద్రం రైల్వే స్టేషన్ ల మధ్య గుర్తు తెలియని రైలు బండి నుండి పడడం వల్ల శరీరం కాళ్లు చేతులు తెగి చనిపోయినట్లు తెలుస్తోంది.

మృతుడు బ్లాక్ కలర్ జీన్స్ ప్యాంట్ బ్లాక్ కలర్ స్వెటర్, వైట్ కలర్ టీ-షర్ట్ ధరించి ఉన్నాడు. మృతుడు 5'5"ఎత్తు కలిగి ఉండి, ఎర్రోడు నుండి విజయవాడ గల రైల్వే ప్రయాణ టికెట్ కలదు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు గాని గుర్తింపు పత్రాలు గాని లేవు. శవాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీలో భద్రపర్చనైనది. ఏమైనా వివరాలు తెలిసిన రైల్వే హెడ్ కానిస్టేబుల్ రాజు 9441557232, 8712658585 కి తెలియపరచగలరు అని అధికారులు తెలిపారు.

Advertisement

Next Story