- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Parliament Sessions: ఉభయ సభలను కుదిపేసిన అదానీ అంశం.. గంటకే వాయిదా
దిశ, వెబ్ డెస్క్: శీతాకాల పార్లమెంట్ సమావేశాలు (Winter Parliament Sessions) ప్రారంభమైన గంటకే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఇటీవల మరణించిన సభ్యులకు సంతాపం ప్రకటించిన తర్వాత.. మధ్యాహ్నం 12 గంటలకు లోక్ సభ (Lok Sabha) వాయిదా పడింది. మరోవైపు రాజ్యసభలో ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే (AICC President Kharge).. గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు, ఆయన అవినీతి అంశాలను రాజ్యసభలో ప్రస్తావించారు. అదానీ (Gautam Adani) అవినీతి బాగోతం యావత్ దేశాన్ని ప్రభావితం చేస్తుందన్నారాయన. అదానీకి ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు. అదానీ అంశంపై చర్చించేందుకు రాజ్యసభ (Rajya Sabha) ఛైర్మన్ జగదీప్ ధన్కర్ నిరాకరించారు. సాధారణ కార్యకలాపాలకు సహకరించాలని సభ్యుల్ని కోరారు. అందుకు విపక్ష సభ్యులు ససేమిరా అనడంతో రాజ్యసభను బుధవారానికి వాయిదా వేశారు.
వాయిదా అనంతరం ప్రారంభమైన లోక్ సభలోనూ అదానీ అంశంపై చర్చించాలని ఇండియా కూటమి ఎంపీలు పట్టుబట్టడంతో.. స్పీకర్ ఓం బిర్లా (Speaker Om Birla)సభను ఎల్లుండికి వాయిదా వేశారు. ఉభయ సభలను అదానీ అవినీతి అంశం కుదిపేసింది. అదానీ అంశంపై చర్చించాల్సిందేనని విపక్షాలు ఆందోళనలు చేశాయి. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో.. ఉభయసభలో హోరెత్తాయి. దాంతో తొలిరోజు శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన గంటకే ఉభయ సభలు వాయిదా పడ్డాయి.