AICC: బీజేపీ పక్షపాత వైఖరి దురదృష్టకరం.. సంభాల్ ఘటనపై రాహుల్ గాంధీ

by Ramesh Goud |
AICC: బీజేపీ పక్షపాత వైఖరి దురదృష్టకరం.. సంభాల్ ఘటనపై రాహుల్ గాంధీ
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ ప్రభుత్వం(BJP Government) పక్షపాత వైఖరి అత్యంత దురదృష్టకరమని(Unfortunate) ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ(AICC Leader Rahul Gandhi) అన్నారు. సంభాల్ ఘటన(Sambhal Incident)పై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. బీజేపీ(BJP)పై తీవ్ర విమర్శలు(Criticized) చేశారు. ఈ సందర్భంగా ఆయన.. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని సంభాల్‌(Sambhal)లో ఇటీవల జరిగిన వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం పక్షపాత ధోరణితో తొందరపాటు వైఖరి అత్యంత దురదృష్టకరమని మండిపడ్డారు.

హింస, కాల్పుల్లో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి(Deepest Condolences)ని తెలియజేశారు. అలాగే అన్ని పార్టీల మాటలను వినకుండా పరిపాలన యొక్క అనుచిత చర్య పరిస్థితిని మరింత దిగజార్చిందని, ఇది చాలా మంది మరణానికి దారితీసిందని, దీనికి బీజేపి ప్రభుత్వమే ప్రత్యక్ష బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అంతేగాక హిందూ-ముస్లిం వర్గాల మధ్య చీలిక, వివక్ష సృష్టించేందుకు బీజేపీ అధికారాన్ని వినియోగించుకోవడం రాష్ట్ర ప్రయోజనాలకు గానీ, దేశానికి గానీ ప్రయోజనం కలిగించదని, వీలైనంత త్వరగా ఈ విషయంలో సుప్రీంకోర్టు(Supreme Court) జోక్యం చేసుకుని న్యాయం చేయాలని, అలాగే యూపీలో శాంతి, పరస్పర సామరస్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఇక మతతత్వం, ద్వేషం కాకుండా ఐక్యత, రాజ్యాంగం మార్గంలో భారతదేశం ముందుకు సాగేలా మనమందరం కలిసి నడవాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.

Advertisement

Next Story