- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Parliament Winter Sessions :పార్లమెంట్ సమావేశాలకు సైకిల్ పై వెళ్లిన టీడీపీ ఎంపీ
దిశ,వెబ్‌డెస్క్: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు(Parliament Winter Sessions) నేడు(సోమవారం) ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై కేంద్రంతో చర్చలు జరుపనున్నట్లు సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మొదటిసారి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన గంటకే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. అయితే తాజాగా ఓ ఆసక్తికర పరిమాణం చోటుచేసుకుంది. అప్పుడెప్పుడో పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వ్యక్తులు చట్టసభలకు సైకిల్ మీద వెళ్లి ఆదర్శంగా నిలిచినట్టు మనం విన్నాం. మళ్లీ ప్రస్తుత కాలంలో అదే సీన్ రిపీట్ చేసి ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళితే.. విజయనగరం(Vizianagaram) ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మొదటి సారి పార్లమెంట్ సమావేశాలకు సైకిల్ పై వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ పార్లమెంట్ సమావేశాలకు టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు(TDP MP Kalishetty Appalanaidu) మరోసారి టీడీపీ(TDP) గుర్తు అయిన సైకిల్ పై వెళ్లారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది.