- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు : మంత్రి పొన్నం ప్రభాకర్
దిశ,శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని తాడికల్ సహకార సంఘం పరిధిలో నిర్వహించబడుతున్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సందర్శించారు. వివరాల్లోకి.... వెళితే హుజురాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్, పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్తుండగా మార్గమధ్యలో తాడికల్ గ్రామంలో నిర్వహించబడుతున్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా పలువురు రైతులతో మాట్లాడుతూ బోనస్ ఖాతాల్లో జమవుతుందా? అని అడుగుతూ రైతు భరోసా ,గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదని త్వరలోనే అందిస్తామన్నారు. అంతేకాకుండా 2 లక్షల లోపు రుణమాఫీ కానీ వారికి త్వరలోనే మాఫీ జరుగుతుందన్నారు. ధాన్యం కొనుగోలు సందర్భంగా సెంటర్ నిర్వాహకులు ఏమైనా కోతలు పెడుతున్నారా? ఇబ్బంది ఏమైనా జరుగుతుందా? అని పలువురు రైతులను ప్రశ్నించాడు. కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వమని రైతుకు ఏ కష్టం రాకుండా చూసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్ ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు