Taapsee Pannu: ఇకపై అలాంటి సినిమాలే చేయాలనుకుంటున్నా.. తాప్సీ కీలక వ్యాఖ్యలు

by Hamsa |
Taapsee Pannu: ఇకపై అలాంటి సినిమాలే చేయాలనుకుంటున్నా.. తాప్సీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను(Taapsee Pannu) అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. తెలుగు, హిందీ, అనే తేడా లేకుండా వరుస చిత్రాలతో ఫుల్ బిజీ బిజీగా మారిపోయింది. అంతేకాకుండా నిర్మాతగానూ మారి పలు చిత్రాలు తెరకెక్కించింది. ప్రజెంట్ ‘గాంధారి’(Gandhari) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దేవాశిష్ ముఖిజా(Devasish Mukhija) తెరకెక్కిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కాబోతుంది.

ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ ఈవెంట్‌లో పాల్గొన్న తాప్సీ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఇండస్ట్రీలో ఉన్న అగ్ర దర్శకనిర్మాతలు నేను పెద్ద హీరోలతో నటించనని అనుకుంటారు. కానీ సవాళ్లతో కూడిన పాత్రలే నేను అంగీకరిస్తానని. మిగతా వాటికి ఓకే చెప్పనని భావిస్తారు. అది వాస్తవం కాదు. అగ్ర హీరోల సినిమాల కథలు నా దగ్గరకు రావని నా మేనేజర్లు(Managers) కూడా ఎప్పుడూ అడుగుతుంటారు.

స్టార్ హీరోల సినిమాల్లో నటించాలనే ఒత్తిడి నాకేం లేదు. ‘డంకీ’(Dunkey) చేసినందుకు చాలా రిలాక్స్‌గా ఉన్నాను. ఇకపై అలాంటి సినిమాలే ఎక్కువ చేయాలనుకుంటున్నా. మంచి పాత్రలుంటే ఏ హీరో సినిమాలోనైనా నటించడానికి సిద్ధంగా ఉన్నా. ‘హసీన్ దిల్‌రూబా’(Haseen Dilruba)లో నా పాత్ర నాకు చాగా ఆనందాన్నించ్చింది. నిజ జీవితంలో నేను అలాగే ధైర్యంగా, తెలివిగా ఉంటాను’’ అని చెప్పుకొచ్చింది.



Next Story

Most Viewed