Brahmamudi : నేను అయితే తీసుకురాలేదు.. వస్తే తీసుకెళ్ళండి అంటూ రాజ్ పై ఫైర్ అయిన కావ్య

by Prasanna |   ( Updated:2024-11-25 06:50:52.0  )
Brahmamudi : నేను అయితే తీసుకురాలేదు.. వస్తే తీసుకెళ్ళండి అంటూ రాజ్ పై ఫైర్ అయిన కావ్య
X

దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముడి ( Brahmamudi) ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

ఇంటికి వచ్చేసరికి కళావతి ఉండదు ఆమె మార్కెట్‌కి వెళుతూ ఉంటుంది. ఇక రాజ్.. ' అర్థమైంది నీ ప్లాన్ .. మా అమ్మను మార్చి నీ వైపుకు తిప్పుకుని.. నువ్వు కూడా మా ఇంటికి రావాలని పెద్ద ప్లాన్ చేశావ్ కదా అంటూ మాట్లాడుతుంటాడు. దానితో కావ్యకు చాలా కోపం వస్తుంది. రాజ్‌ మీద గట్టి గట్టిగా అరుస్తుంది. " నాకే అలాంటి ఆలోచనలు ఉంటే మీరు నా క్యాబిన్ కింద దాక్కున్నప్పుడే మీ గురించి అందరికీ చెప్పేసేదాన్ని .. ఆ రోజే నాకు మీరేం చేయబోతున్నారో కూడా తెలుసు " అని అంటుంది. అయినా రాజ్ మాట్లాడుతూనే ఉంటాడు. ‘మీ అమ్మగారిని నేను పిలవలేదు.. నేను రమ్మనలేదు. మీ వెంట వస్తానంటే మీరే తీసుకెళ్లండి’ అని కావ్య కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

ఇక, రాజ్ బయటే ఉన్నాడనుకుని తెలుసుకుని అపర్ణా దేవి.. కనకంతో.. ఇలా అంటుంది ‘కనకం నేను చెప్పింది చెయ్.. వెళ్లి కూరగాయలు తీసుకురా ’ అని అంటుంది. ఇక అప్పుడే రాజ్.. గుమ్మం దగ్గరకు వచ్చి.. గుమ్మం దాటుతున్నప్పుడు అంతకముందు చెప్పిన మాట గుర్తొస్తుంది. ‘మళ్లీ జన్మలో మీ గుమ్మం తొక్కను గాక తొక్కను ’ అన్న మాట గుర్తొచ్చి.. అక్కడే నిలబడిపోతాడు. ఏం పాపం చేశానే ఇలాంటి కర్మ తీసుకొచ్చేవే నాకు అంటూ కళావతి మీద రాజ్ ఊగిపోతుంటాడు. ఇంటి లోపల చూస్తే.. అపర్ణా దేవి కింద కూర్చొని కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది. కనకం సోఫాలో కూర్చుని కాఫీ తాగుతుంది. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed