డబ్బుల కోసం దాడి.. ఒకరి పరిస్థితి విషమం...

by Sumithra |   ( Updated:2024-12-28 06:36:44.0  )
డబ్బుల కోసం దాడి.. ఒకరి పరిస్థితి విషమం...
X

దిశ, గద్వాల : తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదని పలుమార్లు ఇరు కుటుంబాల మధ్య వాగ్వివాదం జరిగింది. తాజాగా శుక్రవారం రాత్రి ఒక కుటుంబం పై మరొక కుటుంబం దాడి చేసింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి తీవ్ర గాయాలు అవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

వివరాల్లోకెళితే మల్దకల్ మండలం పావనంపల్లి గ్రామంలోని ఒకే వర్గానికి చెందిన రెండు కుటుంబాల మధ్య వారికి రావాల్సిన డబ్బుల కోసం గత మూడు సంవత్సరాల క్రితం నుంచి గొడవలు నడుస్తూ వచ్చాయి. గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తికి తిమ్మప్ప అనేవ్యక్తి మూడు సంవత్సరాల క్రితం ట్రాక్టర్ పొలం దున్నిన డబ్బులు 15 వేల రూపాయలు ఇవ్వాలి. అయితే తిమ్మప్ప చనిపోవడంతో భార్య జములమ్మ (36)ను అడుగుతూ వచ్చారు ట్రాక్టర్ ఓనర్ రాజు. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగి ఒక కుటుంబానికి చెందిన రాజు (42), ఆంజనేయులు (34), లక్ష్మన్న(30), బీసన్న(27), శివ(17) అనే నలుగురు మరో కుటుంబం పై దాడి చేయడంతో సరోజమ్మ(65), జములమ్మ(36), పరుశురాముడు (35)లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో సరోజమ్మ పరిస్థితి విషమంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటన పై ఇంకా బాధితులు ఫిర్యాదు చేయలేదని, ఫిర్యాదు అందితే కేసు నమోదు చేసుకొని విచారణ చేపడతామని గద్వాల సీఐ టంగుటూరి శ్రీనివాస్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed