శ్రీవారి భక్తులకు బిగ్ షాక్.. ఆ 10 రోజులు సిఫార్సులకు నో ఎంట్రీ

by srinivas |
శ్రీవారి భక్తులకు బిగ్ షాక్.. ఆ 10 రోజులు సిఫార్సులకు నో ఎంట్రీ
X

దిశ, వెబ్ డెస్క్: వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. విఐపీ బ్రేక్ దర్శనాలకు పదిరోజులు పాటు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడదని వెల్లడించింది. అంతేకాదు ప్రోటోకాల్ ప్రముఖులు స్వయంగా వస్తేనే బ్రేక్ దర్శన ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేసింది. వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. తిరుమలతో ఆయన ఇవాళ డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా భక్తులు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. జనవరి 10 తేదీన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల తగ్గింపు‌పై ఓ భక్తురాలు ప్రశ్నలు వేశారు. వైకుంఠ ఏకాదశి శుక్రవారం రోజున రావడంతో రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కోటా తగ్గించాల్సి వచ్చిందని ఆమెకు ఈవో బదులిచ్చారు. ఇక వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లై శ్యామలారావు మాట్లాడుతూ జనవరి 10 నుండి 19 వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం1.40 లక్షల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేశామన్నారు. 19,500 శ్రీవాణి టికెట్లను విడుదల చేశామని చెప్పారు. ఆ పదిరోజులు దాతలకు రూ.300 ప్రవేశ దర్శన క్యూ లైన్‌లో మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. జనవరి 8 నుంచి 19 తేదీన వరకు దాతలకు గదుల కేటాయింపు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. జనవరి 7 తేదీన ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆలయంలో మహిళలు, వృద్ధులు పట్ల సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని భక్తుల నుంచి అధికంగా ఫిర్యాదులు వచ్చాయని ఈవో చెప్పారు. రద్దీ తక్కువగా ఉన్నప్పుడు క్యూ కాంప్లెక్స్‌కు దగ్గరగా క్యూలైన్‌లోకి అనుమతించాలని, అలాగే ప్రైవేటు ట్యాక్సీ ఆగడాలను అరికట్టాలని భక్తులు కోరుతున్నారని ఈవో శ్యామలారావు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed