- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Cyber Frauds: క్లిక్ చేస్తే వచ్చేది గ్రీటింగ్స్ కాదు.. న్యూఇయర్ పేరిట సైబర్ మోసాలు

దిశ, డైనమిక్ బ్యూరో: పుట్టిన రోజు, పండుగలు, న్యూఇయర్ (New Year) లాంటి వేడుకలకు ఆన్‌లైన్ లింక్స్ ద్వారా శుభాకాంక్షలు తెలుపడం ఈ మధ్య ఫేమస్ అయింది. అయితే ఇదే అదునుగా భావించిన సైబర్ కేటుగాళ్లు ఫేక్ లింక్స్‌ను క్రియేట్ చేసి మాల్ వేర్‌ను చొప్పించి (cyber frauds) కొత్త తరహా మోసాలకు తెరలేపారు. ఈ క్రమంలోనే ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో తెలంగాణ పోలీస్ (Telangana Police) ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేసింది.
న్యూయర్ గ్రీటింగ్స్ పేరిట సైబర్ మోసాలు.. ఆకర్షణీయమైన న్యూ ఇయర్ గ్రీటింగ్స్ అంటూ సైబర్ వల వేస్తారని హెచ్చరించింది. సోషల్ మీడియాలో విస్తృతంగా యాడ్స్, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో లింక్స్ పంపిస్తారని పేర్కొంది. తొందరపడి లింక్స్ క్లిక్ చేయవద్దని, ఫార్వర్డ్ కూడా చేయొద్దని రిక్వెస్ట్ చేసింది. లింక్ క్లిక్ చేస్తే వచ్చేది గ్రీటింగ్స్ కాదని, మాల్ వేర్ అని వెల్లడించింది. కొత్త ఏడాదిని ఆనందంగా ఆరంభించండి, సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోండని తెలంగాణ పోలీస్ శాఖ సూచించింది.