- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Accident: వాహనం టైరు పేలి బోల్తా.. 13 మందికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం కోమటికుంటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై స్పీడుగా వెళ్తున్న వాహనం టైరు పేలి బోల్తాపడింది. ఈ ఘటనలో 13మందికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషయంగా ఉంది. దీంతో క్షతగాత్రులను స్థానికులు మార్కాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులు వాహనంలో శ్రీశైలం దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. క్షతగాత్రులంతా మహారాష్ట్ర షోలాపూర్ వాసులని తెలిపారు. వాహనం అతివేగంగా ప్రయాణించడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. వాహనదారులు రోడ్డు రూల్స్ పాటించాలని, కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకొని డ్రైవింగ్ చేయాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.