- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నాలుగో వదినే బావుంది అన్నయ్యా.. పవన్ కల్యాణ్‌కు ఫ్యాన్స్ రిక్వెస్ట్
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో స్టార్ హీరోగా ఎదిగిన ఆయన పీక్ టైమ్‌లో సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. ఇటీవల అటు సినిమాలు, ఇటు రాజకీయాల్లో బిజీగా ఉంటూ జోడు గుర్రాల స్వారీ చేశారు. ప్రస్తుతం ఎన్నికలు దగ్గరపడటంతో సినిమాలకు పూర్తిగా గ్యాప్ ఇచ్చి పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్ చేశారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో 24 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అందులో ఐదుగురు అభ్యర్థులను ప్రకటించగా.. మిగిలిన వారిని ప్రకటించేందుకు గెలుపు గుర్రాలను వెలికితీసే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్న తాడేపల్లిగూడెంలో జనసేన-టీడీపీ ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సభలో పవన్ కల్యాణ్‌తో పాటు చంద్రబాబు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ ప్రసంగంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘మాట్లాడితే నాకు నాలుగు పెళ్లిళ్లు అంటూ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతాడు. జగన్ దృష్టిలో నాకు నాలుగు పెళ్లిళ్లు. ఆ నాలుగో పెళ్లాం జగనే’ అని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో జనసైనికులు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. జగన్‌ను మహిళగా మార్చి ఫొటోలు ఎడిట్ చేసి పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్టుల కింద కూడా కామెంట్లతో రెచ్చిపోతున్నారు. నాలుగో వదిన చాలా బాగుంది అన్నయ్య అంటూ కొందరు కామెంట్లు పెడుతుండగా.. నాలుగో పెళ్లి ఎప్పుడు అయిందన్నా అంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.
Read More..
పవన్ నాలుగో భార్య సీఎం జగన్ కాదు, నాదెండ్ల మనోహర్: మంత్రి అంబటి