Pawan Kalyan:వకీల్ సాబ్ మూవీ హీరోయిన్‌కు కృతజ్ఞతలు చెప్పిన పవన్ కళ్యాణ్..కారణం ఇదే!

by Jakkula Mamatha |
Pawan Kalyan:వకీల్ సాబ్ మూవీ హీరోయిన్‌కు కృతజ్ఞతలు చెప్పిన పవన్ కళ్యాణ్..కారణం ఇదే!
X

దిశ,వెబ్‌డెస్క్:రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. వేలాది ఎకరాల పంట నష్టం జరిగింది. ఇక భారీ వర్షాల కారణంగా ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలను వరద బీభత్సం సృష్టించింది. ఈ క్రమంలో వరద బాధితులకు బాసటగా టాలీవుడ్ నటులు నిలుస్తున్నారు. నటి అనన్య నాగళ్ల రూ.5 లక్షల విరాళం అందించింది. ఏపీకి రూ.2.5 లక్షలు, తెలంగాణకు రూ.2.5 లక్షలు విరాళం ఇస్తున్నట్లు తెలిపింది.

వరద బాధితులను ఆదుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తన వంతు సహకారంగా యువ నటి అనన్య నాగళ్ల సీఎం సహాయనిధికి రూ.2.5 లక్షలు విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. కష్ట కాలంలో ప్రజలకు అండగా, నిలబడి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాలకు మీ చేయూత బలాన్నిస్తుంది అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో అనన్య ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అనన్య నాగళ్ల పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. చిన్న హీరోయిన్‌ విరాళం ప్రకటించడంతో మిగతా వారంతా బుద్ధి తెచ్చుకోవాలని నెటిజన్ల కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed