డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గొప్ప మనసు.. మొత్తంగా రూ.6 కోట్ల విరాళం

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-04 15:05:58.0  )
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గొప్ప మనసు.. మొత్తంగా రూ.6 కోట్ల విరాళం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) నిజమైన బాహుబలి అనిపించుకున్నారు. వరద బాధితులకు భారీ మొత్తాన్ని విరాళంగా అందించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో కోటి చొప్పున రెండు కోట్లు విరాళంగా అందించిన పవన్ కల్యాణ్.. తాజాగా.. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలోని వరద ముంపు బారిన పడ్డ 400 పంచాయతీలకు.. ఒక్కో పంచాయతీకి రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ.4 కోట్లు విరాళం ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో మొత్తంగా ఆయన చేసిన సాయం రూ.6 కోట్లకు చేరింది. ఇప్పటివరకు ఇంత మొత్తంలో ఎవరూ అందించలేదు.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్ శాఖ(Panchayat Raj Department) మంత్రిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అలాగే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా మరియు పంచాయతీరాజ్ మంత్రిగా రాష్ట్రంలోని ప్రతి వరద ప్రభావిత ప్రాంతం వద్ద సహాయక చర్యలను పర్యవేక్షిస్తుండంతో పాటు, ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా, ఇప్పటివరకు ఇండస్ట్రీ నుంచి తెలుగు రాష్ట్రాలకు భారీ మొత్తంలో సాయం అందింది. ప్రభాస్ సైతం రెండు కోట్లు అందించారు. మెగాస్టార్ చిరంజీవి కోటి, జూనియర్ ఎన్టీఆర్ కోటి, మహేశ్ బాబు కోటి, అల్లు అర్జున్ కోటి సహా అనేక మంది విరాళాలు ప్రకటించారు.

More News : Pawan Kalyan: ‘హైడ్రా’పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రశంసలు.. సీఎం రేవంత్ మంచి పని చేశారని కితాబు

Advertisement

Next Story

Most Viewed