- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎంతో ముగిసిన భేటీ.. మీడియా కంట పడకుండా వెళ్లిపోయిన బాలినేని
దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ మోహన్ రెడ్డితో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని భేటీ ముగిసింది. కుమారుడితో కలిసి సీఎంవోకు వెళ్లిన ఆయన ఒంగోలు ఎంపీ స్థానంపై మూడు గంటల పాటు చర్చించారు. అనంతరం మీడియా కంట పడకుండా వెళ్లిపోయారు. దీంతో ఆయన ప్రాతిపాదించిన అభ్యర్థనకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అటు ఒంగోలు అసెంబ్లీ స్థానంపైనా సీఎం జగన్ ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తారని చెప్పారు. కానీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విడుదల చేసిన జాబితాల్లో మాత్రం బాలినేని పేరు లేదు. దీంతో ఒంగోలు అసెంబ్లీ, ఎంపీ స్థానాల అభ్యర్థులపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌తో చర్చించాలని బాలినేని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. సీఎం జగన్‌తో చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు సఫలమయ్యాయా లేదా విఫలమయ్యాయా అనేది మాత్రం తెలియలేదు. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారం స్పందిస్తారేమో చూడాలి.